ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో పలువురు లబ్ధిదారులకు ఎన్డీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కలియదిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో నేమకల్లు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు.
Previous Articleఫెంగల్ తుఫాను.. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Next Article రూ.10 వేలకే ఐఫోన్ ఫీచర్స్‌తో మొబైల్
Keep Reading
Add A Comment