సినీ నటి శ్రీరెడ్డిపై కేసు
సినీ నటి శ్రీరెడ్డిపై కేసుపై రాజమహేంద్రవరంలో కేసు నమోదు అయింది.
సినీ నటి శ్రీరెడ్డిపై కేసుపై రాజమహేంద్రవరంలో కేసు నమోదు అయింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీ రెడ్డి పై ఫిర్యాదు చేసారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమంత్రి అనిత పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు. తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి విషం చిమ్మారంటూ పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. మరోవైపు నాలుగు రోజుల కిందట సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని కోరారు. భవిష్యత్ లో ఇలా చేయనని ఆమె తెలిపారు. నాయకులతో యుద్ధం చేయాలని.. కార్యకర్తలతో చేయవద్దని కోరారు.