Telugu Global
Andhra Pradesh

10 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.

10 రోజులు శ్రీవారి  ప్రత్యేక దర్శనాలు రద్దు
X

తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సమయంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అధికారులు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి (జనవరి 10) రోజున దర్శనాలకు అనుమతించబోమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా, పసిబిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులు, రక్షణ శాఖ, ఎన్నారై తదితర విశేష దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నామని బీఆర్ నాయుడు వివరించారు. ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమల ఆలయంలో ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుండడం తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఇప్పటి నుంచే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది.

First Published:  14 Dec 2024 8:34 PM IST
Next Story