ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్..చంద్రబాబు డ్రామాలు తేలిపోయాయి : వైఎస్ జగన్
కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైసీపీ అధినేత జగన్ తెలిపారు
సీఎం చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్‌లో తేలిపోయిందని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. తాజాగా ఆయన బడ్జెట్ పై తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వం పై అబద్దపు ప్రచారాలు చేవారు. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు సంవత్సరాలే ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేవపెట్టారు. అప్పుల విషయంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని చంద్ర బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది.’’
అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు. ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రం రుణం 11లక్షల కోట్లు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్ లోనే తెలిసిపోయింది. గతంలో జగన్ ప్రభుత్వం విఫలం కావాలనేది టీడీపీ ఉద్దేశం అని తెలిపారు జగన్. గత అసెంబ్లీ వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తప్పుడు ప్రచారాలు చేశారని పేర్కొన్నారు.