గద్దర్‌ను తీవ్రవాదితో పొల్చిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
గద్దర్ పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజా యుద్దనౌక గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిషేధిత తీవ్రవాద సంస్థ మావోయిస్ట పార్టీకి సానుకూలంగా ఉన్న గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్ ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌లతో సమానమని కామెంట్స్ చేశారు. గద్దర్‌పై పలు కేసులు ఉన్నాయని ఆరోపించారు. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అని ప్రశ్నించారు.
రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా ? అంటూ ఆగ్రహించారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 'గద్దర్‌కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం..? ఆయన భావజాలం ఎంటి..? బరాబర్ గద్దర్‌కు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? అని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.