Telugu Global
Andhra Pradesh

భారీగా పడిపోయిన చికెన్ ధరలు ఎందుకంటే?

బర్డ్‌ ఫ్లూ భయం అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేట్లు భారీగా పడిపోయి

భారీగా పడిపోయిన చికెన్ ధరలు ఎందుకంటే?
X

ఏపీ తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరుకు ఉభయగోదావరి జిల్లాల్లో 50లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్‌ ఫ్లూ భయం అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు భారీగా పడిపోయింది. నిన్న కేజీ కోడి మాంసం ధర 200-220 ఉన్న రేటు ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. మరోవైపు గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్‌ పరిస్థితుల్ని బర్డ్‌ ఫ్లూ రెడ్‌ జోన్‌ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్‌ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్‌ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.

తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్‌ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా విధించారు.ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్‌ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.కాగా ఆంధ్రప్రదేశ్ లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపిచగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కూడా పలువురు అధికారులు కొద్ది రోజుల వరకు చికెన్ తినకూడదని సూచిస్తున్నారు.

First Published:  11 Feb 2025 4:17 PM IST
Next Story