Telugu Global
Andhra Pradesh

నాలుగు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులు నియామకం

వైసీపీ నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

నాలుగు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులు నియామకం
X

వైసీపీ నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాల నాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా నందిగం సురేష్, పార్టీ పీఏసీ మెంబర్‌గా ఆదిమూలపు సురేష్, విశాఖపట్నం (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్ళా విజయప్రసాద్.. పార్టీ పీఏసీ మెంబర్‌గా, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.

గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎన్టీఆర్‌ జిల్లా అధ్య­క్షుడిగా దేవినేని అవినాష్‌ నియమితు­ల­య్యారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని నియ­మించారు. వెలంపల్లి శ్రీనివాస­రావును పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి (వేమారెడ్డి), పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్‌కుమార్‌ నియమితులయ్యారు.

First Published:  26 Sept 2024 1:59 PM GMT
Next Story