ఏపీ అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం
ఏపీ అసెంబ్లీలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
BY Vamshi Kotas4 Feb 2025 4:51 PM IST
X
Vamshi Kotas Updated On: 4 Feb 2025 4:52 PM IST
ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల ఛైర్మన్‌లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్‌గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు నియామకాన్ని ఆమోదిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైనట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 175 మంది శాసనసభ్యుల నుంచి 9 మంది చొప్పున, 58 మంది శాసనమండలి సభ్యుల నుంచి ముగ్గురు చొప్పున మూడు కమిటీల్లో నియమించారు.
Next Story