అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం
ఏపీ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో అమరాతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునేలా కార్యచరణ చేపట్టనుంది. సుస్థిరత, అవృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి ప్రాతిపదికన వారిని ఎంపిక చేయనుంది. వివిధ రంగాల్లో నిపుణులు ప్రజల్లో మమేకమైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నియమ నిబంధనలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నామినేషన్లను సిఎం చంద్రబాబు , సిఎం కార్యాలయం ద్వారా ఎంపిక జరుగుతోందని వివరించారు.
అయితే అమరావతికి అంబాసిడర్‌గా ఎంపికైన వారికి ఏడాది పాటు టర్మ్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. ఏపీసీఆర్డీఏ, అమరావతిల ఇమేజ్‌ను పెంచేలా బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర ఉండాలని ప్రభుత్వం ఆలోచన. అమరావతి నిర్మాణంలో ప్రగతిని ఎప్పటికప్పడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం లాంటివి చేయాలన్నారు. సక్సెస్ స్టోరీలతోపాటు అవకాశాలు వంటి వాటిని అమరావతి అభివృద్దిలో భాగస్వామ్యంగా తెలియ చేయాల్సి ఉందన్నారు