Telugu Global
Andhra Pradesh

విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పల నాయుడు

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని వైసీపీ ప్రకటించింది. సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు.

విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ  అభ్యర్థిగా చిన అప్పల నాయుడు
X

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని వైసీపీ ప్రకటించింది. సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు జగన్‌ అప్పలనాయుడు పేరును ప్రకటించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బొత్సకు అవకాశం ఇచ్చారు. ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వైఎస్‌ జగన్ అన్నారు.

విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని, ఇందులో 592 మంది వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారు. పార్టీ అభ్యర్థి చిన అప్పలనాయుడు సుమారు నాలుగుదశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఏమండీ కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 2019లో ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ భావిస్తుంటే.. తామే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తోంది.

First Published:  6 Nov 2024 10:09 AM GMT
Next Story