Telugu Global
Andhra Pradesh

గ్రీన్‌ ఎనర్జీ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు

హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వాటికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నదన్న ఏపీ సీఎం

గ్రీన్‌ ఎనర్జీ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు
X

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కానున్నదని తెలిపారు. ఈ హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశీల్లో మంచి డిమాండ్‌ ఉన్నదని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్‌ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు.

గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్‌ చేయనున్నది. ఇక్కడ గ్రీన్‌ అమోనియా తయారుచేసి విదేశాలకు దిగుమతి చేస్తారు. ఈ ప్లాంట్‌పై రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్‌ కంపెనీ బయో కంప్రెస్డ్‌ గ్యాస్‌ తయారీకి 500 కేంద్రాలు పెడుతున్నది. ఒక్కో కేంద్రానికి రూ. 130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది. గడ్డి పెంచడానికి ఎకరాలకు రూ. 30 వేలు కౌలు రైతులకు చెల్లించనున్నది.

బెంగళూరు సంస్థ స్వాపింగ్‌ బ్యాటరీల మోడల్‌ను కుప్పానికి తెచ్చింది. సూర్యఘర్‌ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్‌ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారు. దీంతో వారికి అదనపు ఆదాయం సమకూరనున్నది. సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

First Published:  11 Jan 2025 4:03 PM IST
Next Story