Telugu Global
Andhra Pradesh

కూటమి ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఏపీలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కూటమి ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
X

ఏపీలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని.. పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు….కూటమి సర్కార్‌ పై మండిపడింది. రెండు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మేజిస్ట్రేట్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక అటు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు అయింది. ట్వీట్టర్‌లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ పెట్టిన పొస్టింగులపై ఫిర్యాదు చేశారు స్థానిక కౌన్సిలర్. అయితే.. ఆ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

వ్యక్తుల అరెస్ట్‌ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  9 Nov 2024 4:09 AM GMT
Next Story