ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలివే
మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ సర్వీస్ కమిషన్
BY Raju Asari21 Jan 2025 6:00 PM IST
X
Raju Asari Updated On: 21 Jan 2025 6:00 PM IST
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీలో మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత ఏడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే
Next Story