Telugu Global
Andhra Pradesh

రెడ్‌బుక్‌ రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడులు రాలేదు : ఆర్కే రోజా

ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగమే కారణమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు

రెడ్‌బుక్‌ రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడులు రాలేదు : ఆర్కే రోజా
X

ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై వేసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్మలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్‌ టూర్‌ అట్టర్‌ ఫ్లాప్‌. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్‌ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు‘వైఎస్ వైసీపీ పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె అన్నారు. ఐపీఎస్‌లపై కేసులు పెట్టి వేధిస్తే ఎవరు వస్తారని ఆమె అన్నారు.

అత్యాచారాలు పెరిగిన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని ఆమె ప్రశ్నించారు.చంద్రబాబు, లోకేష్‌ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్‌ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.

First Published:  24 Jan 2025 4:53 PM IST
Next Story