ఏపీ కేబినెట్ మీటింగ్ వాయిదా
ఈ నెల 20న జరగనున్న ఏపీ కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది.

ఈ నెల 20న జరగనున్న ఏపీ కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో ఎల్లుండి జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.. అయితే మళ్లీ ఎప్పుడు ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
గత కొద్ది రోజులుగా ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. కూటమిలోని అన్ని పార్టీల ముఖ్యమంత్రులు.. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగినే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ కూటమి నేతలు పాల్గొనున్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ కొలువుదీరింది