ఏపీలో దీపావళి కానుకగా కొత్త పథకం ప్రారంభం
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్-6లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్-6లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఫ్రీగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సీఎం సూచించారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర 876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర 851. దీనివల్ల ప్రభుత్వంపై 2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుంది.
ఐదేళ్ళకు కలిపి 13వేల 423 కోట్ల అదనపు భారం పడుతుంది అని పేర్కొన్నారు. కోటీ 40 లక్షల రేషన్ కార్డుదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు కేబినెట్ అక్టోబర్ 23న భేటీ కానుంది. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం హామీ అమలుపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాలవాసుల రుణాల రీషెడ్యూల్, పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ వంటి విషయాలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే సీఎస్ అన్ని శాఖలకు లేఖలు కూడా రాశారు.