మహిళల అభివృద్ధి కోసం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ ఫామ్
నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం
Advertisement
దేశ జనాభాలో సగం మంది ఉన్న మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ ఫామ్ (డబ్ల్యూఈపీ) తీసుకువచ్చిందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. మంగళవారం హైటెక్స్ లో డబ్ల్యూఈపీ తెలంగాణ చాప్టర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదగడానికి ఈ చాప్టర్ దోహదం చేస్తుందన్నారు. మహిళలు సంస్థలు స్థాపించి తమ ఎదగడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు దీని సేవలను విస్తరింపజేస్తామన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూఈపీ తెలంగాణ చాప్టర్ వైస్ చైర్మన్ డాక్టర్ సంగీత రెడ్డి, నీతి అయోగ్ వైస్ చైర్మన్, డైరెక్టర్ అన్నరాయ్, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, మహిళలు పాల్గొన్నారు.
Advertisement