కల్వకుర్తి సభలో సీఎంకు మహిళల నిరసన సెగ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు.

Advertisement
Update:2024-07-28 22:46 IST

సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. కల్వకుర్తి సభలో రేవంత్‌ ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు నిల‌బ‌డి ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం అలా ప్రసంగం మొదలుపెట్టారో లేదో మహిళలు నిరసన తెలపడంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా షాక్ అయ్యారు. "దయగల సీఎం గారు మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వండి. డబుల్ బెడ్రూంలకు 80 లక్షల బడ్జెట్ కేటాయించండి" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మహిళల దగ్గర నుంచి ప్లకార్డులు లాగేసుకున్నారు.

నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌ రెడ్డి కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు నిరసన సెగ తగిలింది. సభలో మాట్లాడిన సీఎం.. జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. జూలై 31లోపే రెండో విడత రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు సీఎం. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు గుండుసున్నానే అంటూ విమర్శలు చేశారు.

Tags:    
Advertisement

Similar News