కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు
తెలంగాణలో కులగణన నివేదికతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్నటి శాసన సభ సమావేశం.. తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంచేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయింది. రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని మాజీ మాంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ’ అంటూ ట్వీట్ చేశారు.