రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కిషన్ రెడ్డి బాధ్యత
రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని రేవంత్ లేఖ;
రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయనకు రేవంత్ లేఖ రాశారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించింది. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్‌రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారు. మూసీ ఎందుకు విషం చిమ్ముతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో ఆయన పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు అని రేవంత్ పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడితే.. మమ్మల్ని అడిగి ఇచ్చారా? అంటూ విమర్శిస్తున్నారు. నాది అవగాహనా రాహిత్యమని కిషన్ రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరం. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు తెలంగాణకు ఏం చేశారో చెప్పండి? అని నిలదీశారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.