రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గింది?
కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల ఫైర్
Advertisement
రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగానే నిధులు ఇచ్చిందన్నారు. రామగుండం ఎరువుల పరిశ్రమకు రూ. 6,300 కోట్లు మంజూరు చేసింది. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నది. మేడిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్నది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ. వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నది. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చు కదా? ప్రజలకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ పెట్టవచ్చు కదా? అని ఈటల ప్రశ్నించారు.
Advertisement