జర్నలిస్టుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Advertisement
Update:2025-01-02 15:59 IST

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్లు, హెల్త్ కార్డులు, అక్రిడియేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులకు మంత్రి పొంగులేటి న్యూఇయర్ విషెష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ ఎస్. హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News