చివరి గింజ వరకు కొంటాం

ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు గాని, వ్యాపారాలు గాని రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం

Advertisement
Update:2024-11-14 12:27 IST

వరి కొనుగోళ్ల విషయంలో రైతులు అందోళనపై ప్రభుత్వం స్పందించింది. అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం అమ్ముకునే వాతావరణం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు గాని, వ్యాపారాలు గాని రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో ధాన్యం మార్కెట్‌కు కొనుగోళ్లకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అభయం ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముకోవాల్సి అవసరం లేదని సీఎం సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌, ఇన్‌ ఛార్జి మంత్రి, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలీ కాన్ఫ రెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలవారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా దిగుబడి వస్తున్నందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్‌ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గోదాములకు రవాణా ఏర్పాట్లు చేయాలని, త్వరగా చెల్లింపులు చేసేలా చూడాలని కోరారు. గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాటు, వరి, పత్తి కొనుగోళ్లలో పురోగతి, కొత్త నర్సింగ్‌ కాలేజీ ప్రారంభం, కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, సర్వే తదితర అంశాలపై సీఎస్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వా రా సమీక్షించారు. కలెక్టర్లు ధాన్యం రాక నిత్యం పరిశీలించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు తమ నిర్దేశిత జిల్లాల్లో ధాన్యం తరలింపును పర్యవేక్షించాన్నారు. అధికారులంతా తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ, సీఎస్‌ ఆదేశాలు పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమలు కావడం లేదు. ఖమ్మం మార్కెట్‌లో తేమ శాతాన్ని సూచించే యంత్రాలను వినియోగించకుండానే చేతితోనే తేమ నిర్ణయించి తక్కవ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కలెక్టర్‌ తేమ శాతాన్ని మిషన్‌ ద్వారానే నిర్ధారించాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.  

Tags:    
Advertisement

Similar News