బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి ఆదర్శం.. ఇప్పుడు అంతులేని నిర్లక్ష్యం : కేటీఆర్

పదేండ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు

Advertisement
Update:2024-12-30 13:16 IST

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మ‌రోసారి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కామ‌న్ డైట్ ఆరంభ శూర‌త్వ‌మేనా? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ? ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం ఉంటే ఇప్పుడు అంతులేని నిర్లక్ష్యం చూపిస్తున్నారు" అంటూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు.

ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకులలు దేశానికి ఆదర్శంగా ఉంటే ఇప్పుడు విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News