రాజ్యసభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్పు.. ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కేశవరావు గుర్తింపు
బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కేశవరావును రాజ్యసభ గుర్తించింది. చైర్మన్ (ఉపరాష్ట్రపతి) ఆమోదం మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది.
రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఎస్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ తరపున ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఇకపై వాళ్లందరూ బీఆర్ఎస్ ఎంపీలుగా గుర్తింపు పొందనున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కేశవరావును రాజ్యసభ గుర్తించింది. చైర్మన్ (ఉపరాష్ట్రపతి) ఆమోదం మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఫ్లోర్ లీడర్ కేశవరావుతో పాటు.. కేఆర్ సురేశ్ రెడ్డి, బి.లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోశ్ కుమార్, దామోదర్ రావు, బి. పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఎంపీలుగా ఉన్నారు. ఇకపై వీళ్లందరూ బీఆర్ఎస్ ఎంపీలుగా గుర్తింపు పొందనున్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ గతేడాది దసరా రోజున పార్టీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిరుడు డిసెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీని ఆమోదిస్తూ లేఖ అందడంతో పార్టీ పేరు మార్పును ఘనంగా నిర్వహించారు. అయితే, ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే గెలవడం వల్ల లోక్‌సభ, రాజ్యసభలో పేరుమార్పిడి జరగలేదు. తాజాగా రాజ్యసభో మాత్రం బీఆర్ఎస్ పేరుకు ఆమోదం తెలుపుతూ సచివాలయం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.