అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : తలసాని
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని తలసాని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో నిన్న జరిగిన ఆందోళన పై మాజీ మంత్రి స్పందించారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగిన ఆందోళన పై మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని తలసాని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరమని. బస్తీ వాసులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ మూలంగా ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ విధ్వంసం పై ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉత్తర మండలంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి భయంకర సంఘటనను చూడలేదని, ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని తలసాని అన్నారు. నిన్నముత్యలమ్మ ఆలయం వద్ద బీజేపీ నేతల, హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. పలువురికి గాయాలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశాసిన సంగతి తెలిసిందే.