పొట్టు పొట్టుగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు

Advertisement
Update:2024-10-31 15:43 IST

ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు పొట్టు పోట్టుగా కొట్టుకున్నరు. దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాష్ట్రంలో కూటమి నేతలు ఆధి పత్య పోరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి.

జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది. ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్‌ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News