తెలంగాణ మిగులు బడ్జెట్ రూ.2,738.33 కోట్లు
ద్రవ్యలోటు రూ.54,009.74 కోట్లు;
Advertisement
2025 - 26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన తెలంగాణ బడ్జెట్ లో రూ.2,738.33 కోట్ల మిగులు చూపెట్టారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రాష్ట్ర పద్దులో స్టేట్ ఓన్ రెవెన్యూ తర్వాత రెండో అత్యధిక ఆదాయం అప్పుల రూపంలోనే చూపించినా రెవెన్యూ మిగులు (మిగులు బడ్జెట్) రూ.2,738.33 కోట్లుగా చూపించారు. అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు చేరే మొత్తం ఆదాయంలో ద్రవ్యలోటు రూ.54,009.74 కోట్లుగా చూపించారు. ప్రాథమిక ద్రవ్యలోటును రూ.34,640.72 కోట్లుగా చూపించారు.
Advertisement