తెలంగాణలో ఈ జూన్ నాటికి 500 బస్తీ దవాఖానాలు

గురువారం హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో 363 బస్తీ దవాఖానాలు ఉండగా, మరో 57 ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 80 బస్తీ దవాఖానలు జూన్ చివరి నాటికి పూర్తవుతాయి అని తెలిపారు.

Advertisement
Update:2023-05-04 21:26 IST

పట్టణ కేంద్రాల్లోని పేదలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను విస్తరించే ప్రక్రియను వేగవంత చేసింది. జూన్ చివరి నాటికి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన, చిన్న పట్టణ కేంద్రాల్లో మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటవుతాయి.

GHMC పరిధిలోని అన్ని ప్రాంతాలు, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 350 బస్తీ దవాఖానాలు ఇప్పటికే ఉన్నాయి. మిగిలిన 150 ప్రధాన పట్టణ మున్సిపాలిటీలను కవర్ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

గురువారం హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో 363 బస్తీ దవాఖానాలు ఉండగా,మరో 57 ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 80 బస్తీ దవాఖానలు జూన్ చివరి నాటికి పూర్తవుతాయి అని తెలిపారు.

అవసరం ఉంటే బస్తీ దవాఖానాలు ఆదివారం కూడా తెరిచి ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ''దవాఖానాలను ఆదివారాలు కూడా తెరిచి ఉంచాలి. ప్రతి రోజు బస్తీ దవాఖానాలోని సీనియర్ డాక్టర్ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల మధ్య అందుబాటులో ఉండాలి" అని మంత్రి చెప్పారు.

పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, మే నెలాఖరు నాటికి తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో మొత్తం 3206 పల్లె దవాఖానాలు పూర్తిగా పనిచేస్తాయని, ఈ పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న 321 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పల్లె దవాఖానల్లో డాక్టర్లు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని హరీష్ రావు తెలిపారు.

వరంగల్‌ హెల్త్‌ సిటీ, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్), సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు, నిమ్స్‌తో సహా అన్ని ప్రధాన ఫ్లాగ్‌షిప్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని సీనియర్‌ ఆరోగ్య అధికారులను ఆయన ఆదేశించారు.

"రోడ్లు, భవనాల శాఖ గడువులను నిర్ధారించుకోవాలి, తద్వారా TIMS, NIMS, వరంగల్ హెల్త్ సిటీ వంటి కొత్త ఆసుపత్రుల విస్తరణ ఈ సంవత్సరం దసరా నాటికి పూర్తచేయాలి" అని ఆయన అధికారులను ఆదేశించారు..

Tags:    
Advertisement

Similar News