కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష.. తెలంగాణ ద్విముఖ వ్యూహం భేష్

తెలంగాణ అనుసరించిన ద్విముఖ వ్యూహం గురించి సమీక్షలో ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణలో ఈ ద్విముఖ వ్యూహం అమలు చేశామని చెప్పారాయన.

Advertisement
Update:2023-06-21 16:07 IST

దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో ఏడు రాష్ట్రాల వైద్య ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాలు చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను అడిగి తెలుసుకుంది, పలు సూచనలు చేసింది. మరికొన్నిరోజులపాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ ద్విముఖ వ్యూహం..

ఈ సందర్భంగా తెలంగాణ అనుసరించిన ద్విముఖ వ్యూహం గురించి సమీక్షలో ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ సచివాలయం నుంచి ఆయన సమీక్షలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణలో ఈ ద్విముఖ వ్యూహం అమలు చేశామని చెప్పారాయన. మార్చి మొదటి వారంలోనే ముందస్తు సమీక్ష నిర్వహించి, జిల్లాకు ఇద్దరు చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు హరీష్ రావు. ఆ ఇద్దరు అధికారులు.. సబ్ సెంటర్, పీహెచ్‌సీ సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారని చెప్పారు.

ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారంటే..

పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముందు జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చూశారు. వడ దెబ్బ తగిలిన పెద్దలు, చిన్నారులకు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌ లలో కూడా వడదెబ్బ తగిలినవారికి వాడే మందులు అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచారు. తెలంగాణ అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అభినందించాయి.

Tags:    
Advertisement

Similar News