మాజీ ఎమ్మెల్యే పట్నం పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో పోలీసులు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోవైపు, ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఏఏజీ కోర్టుకు వివరించారు. పోలీసులు వేర్వేరు కేసులు ఎందుకు నమోదు చేశారో తెలిపారు. ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఒకే నేరంపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పును ఈ సందర్బంగా పిటిషనర్ తెలిపారు. పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని, కేసుల వివరాలను ఏఏజీ రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.