కర్నాటక సాహిత్య మందిరానికి రూ.5కోట్లు మంజూరు చేసిన కేసీఆర్

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాలకు వినియోగించుకునే విధంగా కర్నాటక సాహిత్య మందిరంలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి సూచించారు.

Advertisement
Update:2023-03-03 18:32 IST

హైదరాబాద్ లో నివశించే కర్నాటక ప్రజలకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి ఆయన రూ. 5కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా నివశిస్తున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు కేసీఆర్. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ఎప్పటి నుంచో కన్నడిగుల సాహిత్య వేదిక ఉంది. అయితే దీనికి ఆలన పాలన కరువైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు తమ సాహిత్య వేదిక పునరుద్ధరణకోసం నడుం బిగించారు. అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలసి సీఎం కేసీఆర్ ని కలసి సాహిత్య వేదిక పునరుద్ధరణకు విజ్జప్తి చేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాలకు వినియోగించుకునే విధంగా కర్నాటక సాహిత్య మందిరంలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి సూచించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. కన్నడిగులతో కలసి ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ కు కృతజ్జతలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News