తెలంగాణ డీఎస్సీ షెడ్యూల్‌ ఇదే

తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. 13 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.

Advertisement
Update: 2024-06-29 01:47 GMT

తెలంగాణ డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన‌ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం రాత్రి విడుదల చేశారు. నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా ఇచ్చిన తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నోటిఫికేషన్‌లో జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించగా, ఇప్పుడు ఆ తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది.

తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. 13 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. జూలై 18న స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలూ ఉండవు. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం, ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల గడువు ఈనెల 20వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల సంఖ్య సుమారు 2 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Tags:    
Advertisement

Similar News