నంబర్ గేమ్.. క్యాంపు రాజకీయాలు స్టార్ట్
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈసారి బీఆర్ఎస్‌కు అలాంటి అవకాశం దక్కనీయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉండటంతో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కౌంటింగ్ రోజున ఆ పార్టీ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించే పనిలో ఉన్నట్లు సమాచారం. హంగ్ ఏర్పడి నంబర్ గేమ్ మొదలైతే ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈసారి బీఆర్ఎస్‌కు అలాంటి అవకాశం దక్కనీయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల బాధ్యతను అక్కడి నాయకత్వానికి అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన వసతి ఏర్పాట్లు.. రిసార్ట్‌లు బుక్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితి కుదుటపడిన తర్వాత వారంతా తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం.