తెలంగాణ అసెంబ్లీలో చర్లపల్లి జైలు సంవాదం

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై న్యాయవిచారణకు ఆదేశిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి, తిరిగి కోర్టులకెళ్లడమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఈ జైలు జీవితాల వ్యవహారం తైరపైకి వచ్చింది.

Advertisement
Update:2024-07-29 13:22 IST

మీకు చర్లపల్లి జైలుకి వెళ్లిన అనుభవం ఉంది..

మీకు చంచల్ గూడ జైలుకు వెళ్లిన అనుభవం ఉంది..

తెలంగాణ అసెంబ్లీలోలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య జరిగిన సంవాదం ఇది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై న్యాయవిచారణకు ఆదేశిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి, తిరిగి కోర్టులకెళ్లడమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఈ జైలు జీవితాల వ్యవహారం తైరపైకి వచ్చింది.

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికీ చర్లపల్లి జైలులో ఉన్నట్టే మాట్లాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేసింది ఆయనేనని చెప్పారు. తమ నిజాయితీ నిరూపించుకుంటామని వారే ఎంక్వయిరీ అడిగారని.. తీరా ఎంక్వయిరీ వేస్తే కమిషన్ ముందుకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉద్యమ సమయంలో చంచల్ గూడ జైలుకి వెళ్లిన విషయం తనకు గుర్తుందని, తామంతా తెలంగాణ కోసం జైలుకు వెళ్లామని అన్నారు జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలుకి వెళ్లారని, తిరిగి అక్కడికే వెళ్తారనేమో ఆ విషయం గుర్తు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చారు. ఆయనకు చర్లపల్లి మాత్రమే గుర్తుంటుందని, ఆ జైలు జీవితం వారికి అనుభవం అని అన్నారు జగదీష్ రెడ్డి. 



Tags:    
Advertisement

Similar News