గవర్న‌ర్ల వ్యవస్థ గురించి నలుగురు ముఖ్యమంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన తమిళిసై

రాజ్యాంగ పదవిలో ఉండి తాను రాజకీయాలు మాట్లాడను అని చెప్తూనే ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ తన విషయంలో ప్రోటో కాల్ ఎందుకు పాటించడం లేదని, గవర్నర్ అంటే కేసీఆర్ సర్కార్ కు ఎందుకంత చిన్నచూపని ఆమె ప్రశ్నించారు. ఇది అహంకారం కాదా అని ఆమె అన్నారు.

Advertisement
Update:2023-01-19 19:30 IST

నిన్న ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి బహిరంగ సభలో కేసీఆర్ తో సహా కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు గవర్నర్ల తీరుపై విరుచుకపడిన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.

రాజ్యాంగ పదవిలో ఉండి తాను రాజకీయాలు మాట్లాడను అని చెప్తూనే ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ తన విషయంలో ప్రోటో కాల్ ఎందుకు పాటించడం లేదని, గవర్నర్ అంటే కేసీఆర్ సర్కార్ కు ఎందుకంత చిన్నచూపని ఆమె ప్రశ్నించారు. ఇది అహంకారం కాదా అని ఆమె అన్నారు.

తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రొటోకాల్ గురించి తనకు తెలుసని, కేసీఆర్‌ ప్రభుత్వం ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదో సమాధానమిచ్చిన తర్వాతనే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలన్నారు. రాజ్యాంగ బద్దమైన గవర్నర్ వ్యవస్థను హేళన చేస్తున్నారని తమిళీసై మండి పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అవమానించారని ఆమె ఆరోపించారు.

ప్రోటోకాల్ పై ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాతనే ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పిన తమిళిసై రిపబ్లిక్ డే కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అంద‌లేదని అన్నారు.

Tags:    
Advertisement

Similar News