BJLP లీడర్‌పై వీడని సస్పెన్స్‌.. అలా జరిగితే రాజాసింగ్ ఊరుకుంటారా?

రాజాసింగ్‌కు గతంలో BJLP లీడర్‌గా చేసిన అనుభవం ఉంది. గోషామహల్‌ నుంచి వరుసగా 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మందిలోనూ రాజాసింగే సీనియర్.

Advertisement
Update:2023-12-15 12:17 IST

తెలంగాణలో BJP ఫ్లోర్ లీడర్‌పై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితాలొచ్చి దాదాపు 2 వారాలవుతున్నా ఫ్లోర్ లీడర్‌ను నియమించలేదు బీజేపీ. అసెంబ్లీ సమావేశాల అజెండాపై ఇవాళ BAC మీటింగ్ జరుగుతోంది. మీటింగ్‌కు బీజేపీ ప్రతినిధిగా ఎవర్ని పంపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు BJLP పోస్ట్‌ కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ఉన్నారు.

రాజాసింగ్‌కు గతంలో BJLP లీడర్‌గా చేసిన అనుభవం ఉంది. గోషామహల్‌ నుంచి వరుసగా 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మందిలోనూ రాజాసింగే సీనియర్. రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్‌లను ఓడించి అందరి చూపును తనవైపు తిప్పుకున్న వెంకట రమణారెడ్డి కూడా తగ్గేదేలే అంటున్నారు.

BJLP లీడర్‌ కోసం పోటీ ఈ స్థాయిలో ఉంటే రాజాసింగ్ మాత్రం పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మొన్నటి బీజేఎల్పీ సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయిన ఆయన.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కూడా వెళ్లలేదు. బీజేపీ నేతలు సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి తరుణంలో హైకమాండ్ ఎవరివైపు మొగ్గుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తనను కాదని వేరేవాళ్లకు BJLP ఇస్తే రాజాసింగ్ ఊరుకుంటారా?, ఆయని నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News