నిన్న ఉల్లిపాయలు, ఇవాళ గోరింటాకు.. ఫ్రీ బస్సు స్కీమ్‌ వీడియోలు వైరల్‌

బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Update:2024-08-01 12:26 IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌ను అమ‌లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌ మొదలైన నాటి నుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రోజుకో వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. సీట్ల కోసం మహిళలు కొట్టుకోవడం, ఆర్టీసీ సిబ్బందిపై దాడి, బస్సుల్లో వెళ్తూ మహిళలు బ్రష్ చేసుకోవడం, ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం, ఉచితమే కాబట్టి సరదాగా తిరుతున్నామంటూ కొంతమంది మహిళలు పోస్టు చేస్తున్న వీడియోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.


బస్సులో వెళ్తూ ఓ మహిళ బ్రష్‌ చేసిన ఘటన మరువక ముందే.. మరో వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు బుధవారం ఏటూరు నాగారం నుంచి ములుగు వెళ్తున్న బస్సులో కండక్టర్‌పై మహిళ దాడి చేసింది. బస్సు బానెట్‌పై కూర్చోవద్దని చెప్పినందుకు కొడుకుతో కలిసి కండక్టర్‌పై దాడి చేసింది ఓ మహిళ. దీంతో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్‌పై విపరీతమైన చర్చ జరుగుతోంది. పథకం దుర్వినియోగం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


ఇక ఇదే అంశాన్ని రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. పథకం దుర్వినియోగమవుతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ స్కీమ్‌ను అవహేళన చేసేలా వీడియోలు తీస్తున్నారని, అలాంటి వీడియోలపై విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పటివరకూ ఉచిత ప్రయాణ స్కీమ్‌ ద్వారా 70 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News