కాంగ్రెస్ అంతర్గత వివాదలపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం

సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు.;

Advertisement
Update:2025-03-04 19:35 IST

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్‌ హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని ఆమె తెలిపింది. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్‌ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే గుడెం మహిపాల్‌రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య గొడవపై సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ కాట శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అయితే అందరికీ న్యాయం చేస్తా. కొత్త వారికి కలుపుకుని పోతాం. పార్టీ అంతర్గత విషయాలు..మీటింగ్ లోనే చెప్పండి.

గాంధీ భవన్ బయట మాట్లాడొద్దు. మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్ లోనే చెప్పండి. మీటింగులు పెట్టండి.. సోషల్ మీడియ లో పెట్టడం వద్దు. ఇక పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు ఆమె తెలిపారు.అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు.. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పై చర్చించారు. సిద్దిపేట మీద ప్రత్యేక ఫోకస్ పెడతా అని సిద్దిపేట వ్యవహారాలు మంత్రి దామోదర రాజనర్సింహకు చెప్పారు ఆమె. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల ముందు మనం ఎంత అని అన్నారు. కాబట్టి వాళ్ళ త్యాగాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కోసం కూడా కష్టపడాలి అని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News