ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు పదోన్నతి కల్పించారు.పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ కుమార్‌ను రీడిజిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సాల్మన్ ఆరోక్యరాజ్ ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.
2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంవో కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా కొనసాగనున్నారు. కడప జిల్లా కలెక్టర్‌గానే శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు పదోన్నతి కల్పించారు.