'స్పెషల్' పేరుతో ప్రయాణికుల నిలువు దోపిడీ
చార్జీలు భారీగా వసూలు చేస్తున్న ఆర్టీసీ
Advertisement
దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లి హైదరాబాద్ కు తిరిగి వస్తోన్న ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ చార్జీల భారం మోపింది. స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచుకునే వెసులుబాటు ఉందని చెప్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోంది. కరీంనగర్ నుంచి జేబీఎస్ కు సుపర్ లగ్జరీ బస్సు చార్జీ సాధారణ రోజుల్లో రూ.330 కాగా స్పెషల్ బస్సుల పేరుతో ఒక్కో టికెట్ కు రూ.470 వసూలు చేస్తోంది. రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు నడిచే అన్ని బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తోంది. చార్జీల పెంపుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతుందని ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement