మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌ల‌పై ఆర్టీసీ 10 శాతం రాయితీ

హైదరాబాద్‌లో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారుల 10 శాతం రాయితీ టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

Advertisement
Update:2024-11-11 17:23 IST

హైదరాబాద్‌లో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చు.

వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుంది.అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో సుమారు 70 వేల వ‌ర‌కు మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్ పాసులు ఉన్నాయి. ఈ బ‌స్ పాసులు క‌లిగిన ఉన్న‌వారు వీకెండ్‌లో సొంతూళ్ల‌కు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ పాసులు క‌లిగి ఉన్న వారి సౌక‌ర్యార్థం ఏసీ స‌ర్వీసుల్లో 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ లో ముందస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుని కూడా రాయితీ పొందొచ్చు. జ‌న‌ర‌ల్ బ‌స్‌పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని కోరుతున్నాం అని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ త‌న ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News