సీఎం పదవి గుంపు మేస్త్రీ లాంటిదే.. - రేవంత్ రెడ్డి
మంత్రిగా అనుభవం లేని రేవంత్.. ఒకవేళ సీఎం పదవి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎలా చేస్తారంటూ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి.
సీఎం పదవి గుంపు మేస్త్రీ లాంటిదేనన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నడపాలంటే తనకు గుంపు మేస్త్రీగా ఉన్న కామన్‌సెన్స్ సరిపోతుందన్నారు. ఆపార్ట్‌మెంట్ కట్టాలంటే ఆర్కిటెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న రేవంత్.. ఆర్కిటెక్ట్‌ను పట్టుకుంటే సరిపోతుందన్నారు. స్ట్రక్చరల్ ఇంజినీర్ మిగతా ప్లాన్ ఇస్తారన్నారు. టీవీ-9 చర్చ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రిగా అనుభవం లేని రేవంత్.. ఒకవేళ సీఎం పదవి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎలా చేస్తారంటూ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి వ్యక్తిని పీసీసీ చీఫ్ ఎలా చేశారంటూ కొంతమంది కామెంట్ పెడుతుంటే.. మరికొందరు రేవంత్ వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు.
ఇక తాను తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరానన్నారు. తెలుగుదేశం ఇచ్చిన గుర్తింపు వల్తే తనకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కిందన్నారు. కానీ, ఇప్పుడు తాను పూర్తిగా కాంగ్రెస్ వాదినని.. ఇతర పార్టీలతో సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి.