సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషనా..?

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ చేసిన బండి అంట.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారంట అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Advertisement
Update:2023-04-18 15:36 IST

సత్రంలో ఉచితంగా పెట్టే భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ కావాలా అంటూ సెటైర్లు పేల్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై చెణుకులు విసిరారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ చేసిన బండి అంట.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారంట అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హైదరాబాద్ వరదల్లో బండికి బండి ఇస్తానంటూ హామీ ఇచ్చిన బండి.. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అని మాటమార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి, పనిలో పనిగా బండి సంజయ్ ని కూడా చెడుగుడు ఆడుకున్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో బండికి తెలుసా అన్నారు. పోనీ ఎన్ని శాఖలున్నాయో చెప్పు, 24 గంటలు టైమ్ ఇస్తా అంటూ సవాల్ విసిరారు..

ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మోదీ.. చివరకు 7 లక్షల ఉద్యోగాలిచ్చామని పార్లమెంట్ లో ప్రకటించారని, దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేసినట్టు ఆయన పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. 2కోట్ల ఉద్యోగాలు.. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లంటూ అప్పట్లో మోదీ హడావిడి చేశారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ కూడా ఉద్యోగాల విషయంలో ఇలాగే మోసం చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మోదీ చెప్పిన హామీ అమలై ఉంటే.. ఇప్పటి వరకు దేశంలో 20కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. మోదీ నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. రేస్ కోర్టు లో మోదీ ముందు బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ చెయ్యాలని, లేదంటే ఆమరణ నిరాహారదీక్ష అయినా చెయ్యాలని సూచించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో TSPSC పేపర్ లీకేజీ విషయంలో కూడా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నారు. TSPSC ని రద్దు చేసే అధికారం గవర్నర్ కి ఉన్నా కూడా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News