లాంఛనం పూర్తి.. చంద్రశేఖర్ తో రేవంత్ రెడ్డి భేటీ

ఈనెల 18న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారని, ఖర్గే సమక్షంలో చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ లో చేరతారని చెప్పారు రేవంత్.

Advertisement
Update:2023-08-13 18:36 IST

తెలంగాణలో అధికారం మాదే, బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమేనంటూ బీరాలు పలికిన బీజేపీ.. ఎన్నికల ముందు బోల్తా పడబోతోంది. ఇటీవల జయసుధకి కాషాయం కండువా కప్పి.. త్వరలో మరిన్ని చేరికలుంటాయని గొప్పలు చెప్పుకున్న తెలంగాణ బీజేపీ తాజా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి షాకిస్తూ మాజీ మంత్రి చంద్రశేఖర్ ని కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీడీపీలో తన పాత పరిచయాలను ఉపయోగించుకొని మాజీ మంత్రి చంద్రశేఖర్ ని కాంగ్రెస్ వైపు ఆకర్షించారు రేవంత్ రెడ్డి.

మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈనెల 18న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారని, ఖర్గే సమక్షంలో చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ లో చేరతారని చెప్పారు రేవంత్. ఈనెల 18న పేదలకు మేలు చేసే డిక్లరేషన్‌ చేయబోతున్నామని తెలిపారు.

బీజేపీపై ఒత్తిడి పెరుగుతుందా..?

బీఆర్ఎస్ ని ఓడించటం అటుంచి.. ముందు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. ఈ దశలో అసంతృప్తుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇరు పార్టీల్లోనూ అసంతృప్తులున్నారు. చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి చంద్రశేఖర్ తో పని మొదలు పెట్టారు. పాత కాంగ్రెస్ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నా.. కొత్తగా చేరికలతో తన వర్గాన్ని పెంచుకుంటున్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ చేరిక కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది.

Tags:    
Advertisement

Similar News