పుష్పను అరెస్ట్ చేసి రేవంత్ పాన్ ఇండియా సీఎం అయ్యారు : ఎంపీ చామల
అల్లు అర్జున్ అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అరెస్ట్ చేసి పాన్ ఇండియా సీఎం అయ్యారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంత మంది ముఖ్యమంత్రులు అవినీతి చేసి అందరికీ తెలిశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని చెప్పుకొచ్చారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందని ఆరోపించారు.
డిసెంబర్ 04న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో వీక్షించేందుకు విచ్చేయడం.. అక్కడ తొక్కిసలాట జరగడం రేవతి అనే మహిళ మరణించడం శ్రీతేజ్ అనే బాలుడు చావు బతుకుల మధ్య ఆస్పుత్రిలో చికిత్స పొందటం .. ఆ తరువాత ఆయన అరెస్ట్ కావడం.. చంచల్ గూడ జైలుకు వెళ్లడం.. వెంటనే మధ్యంతర బెయిల్ రావడం అంతా చక చక జరిగిపోయాయి. ఈ వివాదం పై అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రస్తావించగా.. అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి మండిపడ్డారు.