కేసీఆర్‌ను కలిసిన రాజయ్య...కీలక బాధ్యతలు అప్పగింత
వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశమైన రాజయ్య..తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి BRSను వీడడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలు రాజయ్యకు అప్పగించిన కేసీఆర్..కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు తప్పకుండ ఉపఎన్నిక వస్తుందని..రాజయ్య అవసరం స్టేషన్ ఘన్‌పూర్‌కు చాలా ఉందన్నారు కేసీఆర్. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని రాజయ్యకు సూచించారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాటికొండ రాజయ్యకు స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ నిరాకరించిన కేసీఆర్..కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. దీంతో రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఇటీవల కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.