సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ
జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలపై సీఎంతో చర్చిస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి సీఎం నివాసంలో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎంతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగిస్తున్నామంటూనే అందులో ఉన్న లోపాలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని మందకృష్ణ మాదిగ సోమవారం లేఖ రాసిన విషయం విదితమే. జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలు, మరికొన్ని దళిత కులాల హక్కులు, వాటా, అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అంశాలపై సూచనలు చేయడానికి అవకాశం ఇవ్వాలని మందకృష్ణ లేఖలో పేర్కొన్నారు.