జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీ, ఎన్ఐటీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. అమ్మాయిల విభాగంలో ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞకు 100 పర్సంటైల్ వచ్చింది. తెలంగాణ విద్యార్థి బనిబ్రత మజీ కూడా 100 పర్సంటైల్ సాధించాడు. మొదటి సెషన్ ఫలితాలకు https://jeemain.nta.nic.in/ వెబ్ పోర్టల్ ను సందర్శించాలి. ఈ ఏడాది జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరగనుంది. కాగా, రెండు సెషన్ల నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేస్తారు.