సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీవీ సింధు.. పెళ్లికి రావాలని ఇన్విటేషన్

Advertisement
Update:2024-12-14 20:15 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కలిశారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన సింధు ఈ నెల 22న రాజస్థాన్ లో జరిగే తన వివాహానికి రావాలని.. సీఎంకు శుభలేఖ అందించారు. ఈ సందర్బంగా సింధూకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వీరి పెళ్లి జరగనుంది. ఆ తర్వాత 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.కాగా ఈ రోజు మధ్యహ్నం కుటుంబ సభ్యుల నడుమ ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్‌ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను సింధు ఇన్‌స్టాగ్రామ్‌వేదికగా అభిమానులతో పంచుకున్నది.

Tags:    
Advertisement

Similar News